📢 Advertisement Space

బీజేపీ జనతా వారధిలో ద్వారపురెడ్డి పరమేశ్వరరావుకు పెదముసిలివాడ ప్రజా సమస్యలపై వినతిపత్రం

🗞️ బిబి న్యూస్ | 10 Jul 2026

అనకాపల్లి, జూలై 10: అనకాపల్లి జిల్లా బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన బీజేపీ జనతా వారధి కార్యక్రమంలో పరవాడ మండలం పెదముసిలివాడ గ్రామ ప్రజల తాగునీటి సమస్యతో పాటు సమీప సముద్ర తీర ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని కోరుతూ పరవాడ మండల అధ్యక్షుడు పిల్లా సతీష్, మండల ప్రధాన కార్యదర్శి బంతిపూడి గోవిందరాజులు అనకాపల్లి జిల్లా బీజేపీ అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావుకు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ద్వారపురెడ్డి పరమేశ్వరరావు మాట్లాడుతూ, పెడముసిలివాడ గ్రామంలో తాగునీటి సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కారానికి కృషి చేస్తామని, అలాగే సముద్ర తీర ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేసే అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అవసరమైన చర్యలు చేపట్టేలా ప్రయత్నిస్తామని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారమే బీజేపీ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గల్లా రాజేశ్వరరావు, బీజేపీ నాయకులు దాడి వీరునాయుడు, కె. పవన్, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.