అనకాపల్లి జిల్లాలో బీజేపీకి త్రిమూర్తుల బలం.. సభ్యత్వాల జోరుతో బుల్లెట్ ట్రైన్ లా దూసుకుపోతున్న కమలం.
🗞️ బిబి న్యూస్ | 09 Jul 2026
అనకాపల్లి, జూలై 9 (బీబీ న్యూస్):
అనకాపల్లి జిల్లా భారతీయ జనతా పార్టీకి కొత్త ఉత్సాహాన్ని నింపుతూ సభ్యత్వ నమోదు కార్యక్రమం వేగంగా కొనసాగుతోందని పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి. జిల్లా అధ్యక్షుడిగా ద్వారపురెడ్డి పరమేశ్వరరావు బాధ్యతలు చేపట్టిన అనంతరం సభ్యత్వ నమోదు కార్యక్రమం మరింత ఊపందుకుందని స్థానిక నాయకులు, కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు పార్టీ విస్తరణకు కార్యాచరణ రూపొందిస్తూ ముందుకు సాగుతుండగా, జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డెడ నాగేశ్వరరావు సంస్థాగత బలోపేతం, కార్యక్రమాల నిర్వహణ, కార్యకర్తల సమన్వయంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
మరోవైపు, అనకాపల్లి జిల్లా బీజేపీ సీనియర్ నాయకులు, ఆధ్యాత్మికవేత్త దాడి వీరునాయుడు నూతన సభ్యత్వాలు, కొత్త చేరికలపై ప్రత్యేకంగా కృషి చేస్తూ ప్రతిరోజూ పలువురిని పార్టీలోకి ఆహ్వానిస్తూ బీజేపీ బలోపేతానికి తన వంతు పాత్ర పోషిస్తున్నారని కార్యకర్తలు పేర్కొంటున్నారు.
ఈ ముగ్గురు నాయకుల సమన్వయంతో జిల్లాలో బీజేపీ సంస్థాగతంగా మరింత బలపడుతోందని, సభ్యత్వ నమోదు కార్యక్రమం ఊపందుకోవడంతో పార్టీ గ్రామస్థాయి వరకు విస్తరిస్తోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.రానున్న రోజుల్లో అనకాపల్లి జిల్లాలో బీజేపీని మరింత బలోపేతం చేసి ప్రజల్లో పార్టీకి ఆదరణ పెంచేందుకు ఈ ముగ్గురు నాయకులు సమిష్టిగా పనిచేస్తున్నారని, వారి నాయకత్వంలో పార్టీ మరింత ముందుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని పలువురు కార్యకర్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.