ఎలమంచిలి బీజేపీ నాయకుడు కొరుప్రోలు చిన్నారావు జన్మదిన వేడుకలు
🗞️ బిబి న్యూస్ | 08 Jul 2026
అనకాపల్లి, జూలై 8: ఎలమంచిలి నియోజకవర్గ బీజేపీ నాయకుడు కొరుప్రోలు చిన్నారావు జన్మదిన వేడుకలు అనకాపల్లి జిల్లా బీజేపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం అనకాపల్లి జిల్లా బీజేపీ అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు కొరుప్రోలు చిన్నారావును శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ అభివృద్ధికి ఆయన మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డేడ నాగేశ్వరరావు, దాడి వీరునాయుడు, కర్రి రామకృష్ణ, బొడ్డేడ భాస్కరరావు, మళ్ల కాలేశ్వరరావు, నానాజీ, గంగుపాం నాగేశ్వరరావుతో పాటు పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని చిన్నారావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.