గవరపాలెంలో ఆర్‌ఎస్‌ఎస్ సేవకులు పొలిమేర కన్నప్పారావు సతీమణి దినకర్మలో పాల్గొన్న బీజేపీ నాయకులు
🗞️ బిబి న్యూస్ | 08 Jul 2026
అనకాపల్లి, జూలై 8: అనకాపల్లి గవరపాలెంకు చెందిన ఆర్‌ఎస్‌ఎస్ సేవకులు, బీజేపీ సీనియర్ నాయకులు పొలిమేర కన్నప్పారావు సతీమణి దినకర్మ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అనకాపల్లి జిల్లా బీజేపీ అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు హాజరై మృతురాలికి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డేడ నాగేశ్వరరావు, దాడి వీరునాయుడు, గంగుపాం నాగేశ్వరరావు, గరికి వెంకట్రావు, పెనమటి అప్పారావుతో పాటు బీజేపీ నాయకులు, ఆర్‌ఎస్‌ఎస్ సేవకులు, కార్యకర్తలు పాల్గొని మృతురాలికి నివాళులర్పించారు.