📢 Advertisement Space

కశింకోటలో ఘనంగా వైఎస్సార్ 77వ జయంతి వేడుకలు

🗞️ బిబి న్యూస్ | 08 Jul 2026

కశింకోట, జూలై 8: దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి సందర్భంగా బుధవారం కశింకోట గ్రామ జంక్షన్‌లో ఉన్న ఆయన విగ్రహానికి గౌరవ అనకాపల్లి నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త మాలసాల భరత్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా నాయకులు వైఎస్సార్ ప్రజా సంక్షేమ పాలనను స్మరించుకుంటూ, ఆయన ఆశయాల సాధనకు కృషి చేస్తామని పేర్కొన్నారు. అనంతరం విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన విభాగ కార్యదర్శి మలసాల కుమార్ రాజా, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు మళ్ళ బుల్లిబాబు, కశింకోట జడ్పీటీసీ శ్రీధర్ రాజు, కశింకోట ఎంపీపీ కలగా గున్నయ్య నాయుడు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గొల్లవెల్లి శ్రీను, కశింకోట మండల మహిళా అధ్యక్షురాలు నూకరత్నం, సన్నీ జేమ్స్, నూకరాజు, నియోజకవర్గ బూత్ వింగ్ అధ్యక్షుడు మందపల్లి శివాజీతో పాటు గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.