మునగపాకలో ఘనంగా దివంగత వైఎస్సార్ జయంతి వేడుకలు
🗞️ బిబి న్యూస్ | 08 Jul 2026
మునగపాక, జూలై 8: అనకాపల్లి జిల్లా మునగపాక మండలంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మునగపాక జడ్పీటీసీ సభ్యులు పెంటకోట స్వామి సత్యనారాయణ ఆధ్వర్యంలో వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా పెంటకోట స్వామి సత్యనారాయణ మాట్లాడుతూ, దివంగత వైఎస్సార్ ప్రజల సంక్షేమానికి జీవితాంతం కృషి చేసిన మహానేత అని కొనియాడారు. ఆయన చూపిన సంక్షేమ మార్గంలో ముందుకు సాగుతూ, ప్రజా సేవకు కట్టుబడి పనిచేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర జాతీయ బీసీ సంక్షేమ సంఘం కార్యనిర్వాహక అధ్యక్షులు కాండ్రేగుల చందు, అనకాపల్లి జిల్లా రజక విభాగం అధ్యక్షులు, మునగపాక ఎంపీటీసీ బోడకుర్తి గణేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు.కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అనకాపల్లి జిల్లా ఎస్సీ సెల్ మాజీ అధ్యక్షులు పిల్ల అప్పారావు, ఎలమంచిలి నియోజకవర్గ సోషల్ మీడియా అధ్యక్షులు పోలవరపు రమణ ప్రసాద్, బొడ్డేడ మహేష్, ఆడారి సంతోష్, మొల్లి సంతోష్, పీల సూరిబాబు, మొల్లి ముసిలినాయుడు, పొలిమేర దేవకి, ఇంటి శ్రీను, పెంటకోట రాము, పెంటకోట నిఖిల్, బొడ్డేడ నారాయుడు, టెక్కలి జయప్రకాశ్, మంత్రి చంద్రశేఖర్ తదితరులు పాల్గొని వైఎస్సార్‌కు ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా నాయకులు వైఎస్సార్ సేవలను స్మరించుకుంటూ, ఆయన ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.