గవరపాలెంలో బీజేపీ అటల్జీ మండల సమావేశం
🗞️ బిబి న్యూస్ | 07 Jul 2026
అనకాపల్లి, జూలై 7: అనకాపల్లి పట్టణంలోని గవరపాలెంలో భారతీయ జనతా పార్టీ అటల్జీ మండల సమావేశం నిర్వహించారు. సమావేశంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ పథకాలపై నాయకులు చర్చించారు.రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఆదేశాల మేరకు, అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు పర్యవేక్షణలో, జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డెడ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డెడ నాగేశ్వరరావు మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశాభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని అన్నారు. ఆ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంతో పాటు పార్టీని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.అనంతరం సీనియర్ నాయకుడు దాడి వీరునాయుడు మాట్లాడుతూ, పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ ఐకమత్యంతో పనిచేయాలని, వ్యక్తిగత భేదాభిప్రాయాలు, పంతాలు, పట్టింపులకు తావు ఇవ్వకూడదని సూచించారు. బూత్ స్థాయి (బీఎల్-2) కార్యకర్తల నుంచి మండల స్థాయి నాయకుల వరకు అందరూ సమన్వయంతో పనిచేస్తే పార్టీ మరింత బలపడుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కోనపల్లి సన్యాసిరావు, మండల కార్యదర్శి కర్రి పరదేశినాయుడు, సీనియర్ నాయకులు బొడ్డేటి చలపతిరావు, సూరిశెట్టి భాస్కరరావు, అడ్వకేట్ నానాజీ, మద్దాల నాగశివ, బత్తిన లక్ష్మీ, రాపేటి సంతోష్ తదితరులు పాల్గొన్నారు.