📢 Advertisement Space

డా. శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన బీజేపీ నాయకులు

🗞️ బిబి న్యూస్ | 06 Jul 2026

అనకాపల్లి, జూలై 6: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షులు ఆడారి ఆనంద్ కుమార్ ఆదేశాల మేరకు జిల్లా బీజేపీ అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డెడ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో డా. శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా అనకాపల్లి పట్టణంలోని చదువులవారి వీధిలో ఉన్న బీజేపీ జిల్లా కార్యాలయంలో డా. శ్యామా ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన దేశానికి చేసిన సేవలను, భారతీయ జనతా పార్టీ నిర్మాణంలో ఆయన పోషించిన కీలక పాత్రను నాయకులు కొనియాడారు.అలాగే గవరపాలెం పార్క్ సెంటర్, కొండ కొప్పాక, మసీదు సెంటర్, గాంధీనగరం తదితర ప్రాంతాల్లో కూడా డా. శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి కార్యక్రమాలను నిర్వహించి ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో దాడి వీరునాయుడు, గేదెల స్వరూప్, యర్రా వెంకట్రావు, బమిడిపాటి సుబ్బారావు, మళ్ల కాళేశ్వరరావు, గండేపల్లి శేషు పరదేశినాయుడు తదితర బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.