📢 Advertisement Space

మహిళా శక్తే దేశ ప్రగతికి పునాది – మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు నిశిదా రాజు

🗞️ బిబి న్యూస్ | 03 Jul 2026

అనకాపల్లి: డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి పక్షోత్సవాల సందర్భంగా భారతీయ జనతా యువ మోర్చా, మహిళా మోర్చా ఆధ్వర్యంలో అనకాపల్లి పట్టణంలోని సత్యా గ్రాండ్ హోటల్‌లో నిర్వహించిన విద్యార్థుల ప్రత్యేక సమావేశంలో బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు నిశిదా రాజు మహిళలను ఉద్దేశించి ప్రేరణాత్మకంగా ప్రసంగించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, "మహిళ సాధికారతే దేశ అభివృద్ధికి నిజమైన పునాది. కుటుంబాన్ని తీర్చిదిద్దే మహిళ సమాజాన్ని, సమాజం ద్వారా దేశ భవిష్యత్తును నిర్మించగలదు" అని అన్నారు.డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఆశయాలు ప్రతి మహిళకు స్ఫూర్తిగా నిలవాలని, దేశభక్తి, క్రమశిక్షణ, సేవాభావం వంటి విలువలను కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా పిల్లలకు చిన్ననాటి నుంచే అలవాటు చేయాల్సిన బాధ్యత తల్లులదేనని పేర్కొన్నారు.నేటి యువతులు విద్యతో పాటు వ్యక్తిత్వ వికాసం, నాయకత్వ లక్షణాలు, సామాజిక సేవపై దృష్టి సారించాలని సూచించారు. మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో ఉండటంతో పాటు దేశ సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షిస్తూ దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించాలని అన్నారు.ప్రతి ఇంటిలో దేశభక్తి వాతావరణం నెలకొల్పాలని, పిల్లలకు "వందే మాతరం", "జనగణమన" వంటి జాతీయ గీతాల ప్రాముఖ్యతను తెలియజేసి దేశం పట్ల గౌరవభావాన్ని పెంపొందించాలని పిలుపునిచ్చారు.మహిళలు తమ హక్కులతో పాటు తమ బాధ్యతలను కూడా గుర్తించి సమాజ సేవలో భాగస్వాములు కావాలని, యువతకు ఆదర్శంగా నిలవాలని ఆమె కోరారు. దేశాభివృద్ధి కోసం మహిళల భాగస్వామ్యం మరింత పెరగాలని, ప్రతి మహిళ దేశసేవకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు, రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ సి.ఎం. రమేష్, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కేతినేని సురేంద్ర మోహన్, సుజాత, అనకాపల్లి జిల్లా బీజేపీ అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, బీజేపీ ప్రధాన కార్యదర్శి బొడ్డెడ నాగేశ్వరరావు, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు నాగమణి, బీజేపీ యువ మోర్చా జిల్లా అధ్యక్షుడు శ్రీరంగం శ్రీనివాస్, గవరపాలెం బీజేపీ నాయకులు కొణతాల అప్పలరాజు, కర్రి రామకృష్ణ, దాడి వీరునాయుడు, తరణ దాలినాయుడు, మళ్ల కాళేశ్వరరావు, అడ్వకేట్ నానాజీ, సన్యాసిరావు, జర్నలిస్ట్ సాయి, పలకా రవి, తాతారావు, గరికి వెంకటరావు, బొడ్డెడ శేషగిరిరావు, కొణతాల సాయిరామ్ ప్రసాద్, కొణతాల వెంకట్, రాజు, పంచాడ గంగరాజుతో పాటు అధిక సంఖ్యలో విద్యార్థులు, మహిళలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.