శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఆశయాలు యువతకు స్ఫూర్తి కావాలి: అనకాపల్లి ఎంపీ డాక్టర్ సి.ఎం. రమేష్
🗞️ బిబి న్యూస్ | 01 Jul 2026
అనకాపల్లి, జూలై 1: డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి పక్షోత్సవాల సందర్భంగా భారతీయ జనతా యువ మోర్చా, మహిళా మోర్చా ఆధ్వర్యంలో అనకాపల్లి పట్టణంలోని సత్యా గ్రాండ్ హోటల్‌లో విద్యార్థులతో ప్రత్యేక సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు, రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ సి.ఎం. రమేష్ మాట్లాడుతూ డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఆశయాలు నేటి యువతకు స్ఫూర్తిదాయకమని అన్నారు.దేశభక్తి, జాతీయ సమైక్యత కోసం డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ చేసిన త్యాగాలు, సేవలను ప్రతి భారతీయుడు స్మరించుకోవాలని ఆయన పేర్కొన్నారు. యువత దేశాభివృద్ధిలో భాగస్వాములు కావడంతో పాటు మహనీయుల ఆశయాలను ఆచరణలో పెట్టాలని సూచించారు.ప్రతి విద్యార్థి "వందే మాతరం", "జనగణమన" తప్పనిసరిగా నేర్చుకుని దేశభక్తి భావాన్ని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. దేశం పట్ల బాధ్యత, అంకితభావంతో ముందుకు సాగుతూ జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, దేశసేవకు సిద్ధంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు.డాక్టర్ సి.ఎం. రమేష్ పిలుపుకు స్పందించిన విద్యార్థులు దేశసేవకు అంకితమవుతామని ప్రతిజ్ఞ చేశారు.ఈ కార్యక్రమంలో మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు నిశిదా రాజు, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కేతినేని సురేంద్ర మోహన్, సుజాత, జిల్లా అధ్యక్షుడు ద్వారపూరెడ్డి పరమేశ్వరరావు, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు నాగమణి, బీజేపీ యువ మోర్చా జిల్లా అధ్యక్షుడు శ్రీరంగం శ్రీనివాస్‌తో పాటు అధిక సంఖ్యలో విద్యార్థులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.