📢 Advertisement Space

సనాతన ధర్మ పరిరక్షణకు మరో అడుగు.. "మన ఆచారాల అంతరార్థం" పుస్తకం ఆవిష్కరణ

🗞️ బిబి న్యూస్ | 29 Jun 2026

అనకాపల్లి, జూన్ 27 (బీబీ న్యూస్):
స్వర్గీయ పి.వి. చలపతి రావు 92వ జయంతి సందర్భంగా విశాఖపట్నంలోని సాగరమాల ఆడిటోరియంలో నిర్వహించిన 4వ స్మారక వీర సావర్కర్ ఉపన్యాస సభ ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమంలో డా. బి.ఎం. నాయుడు, దాడి వీరునాయుడు సూచనల మేరకు సనాతన ధర్మ పరిరక్షణ లక్ష్యంగా రచించిన పుస్తకాలలో ఒకటైన "మన ఆచారాల అంతరార్థం" పుస్తకాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ సతీమణి పి. మాధురి చేతుల మీదుగా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మాట్లాడిన పి. మాధురి, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, సనాతన ధర్మ గొప్పతనాన్ని ప్రజలకు చేరవేసే ఉద్దేశంతో రూపొందించిన ఇటువంటి విలువైన గ్రంథాన్ని ఆవిష్కరించడం ఆనందంగా ఉందన్నారు. సమాజంలో ధార్మిక చైతన్యం పెంపొందించేందుకు కృషి చేస్తున్న డా. బి.ఎం. నాయుడు, దాడి వీరునాయుడు చేసిన ప్రయత్నాన్ని ఆమె అభినందిస్తూ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ చొరవతో పాటు, రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు ఆడారి ఆనంద్ కుమార్, రాష్ట్ర బీజేపీ కమిటీ సభ్యులు కొణతాల రాజబాబు, అనకాపల్లి జిల్లా బీజేపీ అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు కీలక పాత్ర పోషించారు. భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా జిల్లా వ్యాప్తంగా మండల నాయకులను సమీకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు పలువురు నాయకులు వారిని అభినందించారు.ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి బొడ్డెడ నాగేశ్వరరావు, గవరపాలెం బీజేపీ నాయకులు కొణతాల అప్పలరాజు, కర్రి రామకృష్ణ, దాడి వీరునాయుడు, తరణ దాలినాయుడు, మళ్ల కాళేశ్వరరావు, అడ్వకేట్ నానాజీ, సన్యాసిరావు, జర్నలిస్ట్ సాయి, పలకా రవి, తాతారావు, గరికి వెంకటరావు, బొడ్డెడ శేషగిరిరావు, కొణతాల సాయిరామ్ ప్రసాద్, కొణతాల వెంకట్, రాజు, పంచాడ గంగరాజు తదితరులు పాల్గొన్నారు.