📢 Advertisement Space

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం: సోనియా గాంధీ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసిన డా.జగన్ నాయక్

🗞️ బిబి న్యూస్ | 02 Jun 2026

హైదరాబాద్, జూన్ 2 (ప్రతినిధి): తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళవారం హైదరాబాద్ బంజారా హిల్స్‌లోని గాంధీ భవన్‌లో బంజారా భారత్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డా.జగన్ నాయక్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు.తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 2న ఆవిర్భావం చేందిన సందర్భంగా ఈ ప్రత్యేక కార్యక్రమంను గాంధీ భవన్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా డా.జగన్ నాయక్ మాట్లాడుతూ, "2014 జూన్ 2న సోనియా గాంధీ వలన తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం చెందింది. కాంగ్రెస్ పార్టీకి నిజంగా తెలంగాణ ప్రజలు రుణపడి ఉంటారు" అని అన్నారు.రానున్న రోజులలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా వస్తుందని, రాహుల్ గాంధీ తప్పకుండా ప్రధానమంత్రి అవుతారని డా.జగన్ నాయక్ ఆశాభావం వ్యక్తం చేశారు.తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో 29వ రాష్ట్రంగా ఆవిర్భవించింది. ఆంధ్రప్రదేశ్‌ నుండి వేరు చేసి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయడం వెనుక ఎందరో మహానుభావుల పోరాటాలు, ప్రాణత్యాగాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరుపుకుంటున్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, నేతలు పాల్గొన్నారు.