📢 Advertisement Space

ఎమ్మెల్యే ఇలాకాలో రెండు నెలలుగా నీటి సమస్య. అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల ఆగ్రహం

🗞️ బిబి న్యూస్ | 28 May 2026

అనకాపల్లి పట్టణంలోని గవరపాలెం ప్రాంతంలో తాగునీటి సమస్య తీవ్రంగా మారింది. ప్రముఖ రాజకీయ నాయకుల కార్యకలాపాలకు కేంద్రంగా నిలిచే తెలుగుదేశం పార్టీ కార్యాలయం సమీపంలోని వాటర్ ట్యాంక్‌కు గత రెండు నెలలుగా సరైన నీటి సరఫరా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.మండుటెండల్లో నీటి కోసం స్థానికులు పడుతున్న ఇబ్బందులు రోజురోజుకూ పెరుగుతున్నాయని ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు.“నాయకుల ప్రాంతంలోనే ఈ పరిస్థితి ఉంటే, మిగతా ప్రాంతాల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు” అంటూ స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేశారు. తక్షణమే అధికారులు స్పందించి వాటర్ ట్యాంక్‌కు నిరంతర నీటి సరఫరా పునరుద్ధరించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.నీటి సమస్యపై మున్సిపల్ అధికారులు వెంటనే చర్యలు తీసుకుని ప్రజలకు ఉపశమనం కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.