అనకాపల్లి జిల్లాలో ప్రైవేట్ విద్యాసంస్థల పుస్తకాల దందా అధికారుల నిర్లక్ష్యంతో తల్లిదండ్రులపై ఆర్థిక భారం!
🗞️ బిబి న్యూస్ | 28 May 2026
అనకాపల్లి జిల్లాలోని అనేక ప్రైవేట్ పాఠశాలలు విద్యార్థుల తల్లిదండ్రులను బలవంతంగా స్కూల్ లో, నోట్‌బుక్స్, యూనిఫారాలు కొనుగోలు చేయాలని ఒత్తిడి చేస్తున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.మార్కెట్‌లో తక్కువ ధరకే లభించే పుస్తకాలను పక్కన పెట్టి, స్కూల్ యాజమాన్యాలు నుంచే కొనాలని చెప్పడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.కొన్ని విద్యాసంస్థలు కమిషన్ల కోసం ప్రచురణ సంస్థలతో ఒప్పందాలు చేసుకుని,అధిక ధరలకు పుస్తకాలను విక్రయిస్తున్నాయని సమాచారం. ఒక విద్యార్థికి అవసరమైన పుస్తకాల ఖర్చు వేల రూపాయలకు చేరుతుండగా,మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి.ప్రభుత్వ నిబంధనల ప్రకారం పాఠశాలలు తల్లిదండ్రులను ఒకే దుకాణానికి పరిమితం చేయకూడదు.అయినప్పటికీ జిల్లాలో ఈ నిబంధనలు బహిరంగంగానే ఉల్లంఘించబడుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. కానీ విద్యాశాఖ అధికారులు మాత్రం ఈ వ్యవహారాన్ని పట్టించుకోవడం లేదని తల్లిదండ్రులు మండిపడుతున్నారు.
తల్లిదండ్రుల ప్రశ్నలు:
అధిక ధరలకు అమ్ముతున్న వారిపై చర్యలు ఎందుకు లేవు?
విద్యాశాఖ అధికారులు తనిఖీలు చేస్తున్నారా?
కమిషన్ వ్యవహారాలపై విచారణ ఉంటుందా?
ప్రతి ఏడాది ఇదే పరిస్థితి కొనసాగుతున్నా, సంబంధిత అధికారులు కఠిన చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. విద్యను వ్యాపారంగా మార్చిన ప్రైవేట్ సంస్థలపై ప్రభుత్వం వెంటనే స్పందించి, తల్లిదండ్రులకు న్యాయం చేయాలని ప్రజలు కోరుతున్నారు