బంజారా భారత్ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఏర్పాటు — సమాజ ఐక్యత, హక్కుల సాధనమే లక్ష్యం
🗞️ బిబి న్యూస్ | 25 May 2026
బంజారా సమాజ అభివృద్ధి, హక్కుల పరిరక్షణ మరియు సామాజిక సేవా కార్యక్రమాల విస్తరణ లక్ష్యంగా బంజారా భారత్ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఏర్పాటు దిశగా ఆదివారం హైదరాబాదులో రాష్ట్ర స్థాయి సమావేశం ఘనంగా జరిగింది. హైదరాబాద్ జిల్లా యాకుత్తుపురా నియోజకవర్గం ఐఎస్ సాధన్ డివిజన్ పరిధిలోని వినయ్ నగర్ కమిటీ హాల్‌లో జరిగిన సమావేశాన్ని అఖిల భారతీయ బంజారా మహా సేవా సంఘం (ఏబీఎంఎస్) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జగన్ నాయక్ విశ్లావత్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
బంజారా భారత్ వ్యవస్థాపకుడు, నేషనల్ చైర్మన్ మరియు మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ ముఖ్య అతిథిగా హాజరై సమావేశాన్ని ప్రారంభించారు. మాట్లాడిన సమయంలో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో, ముఖ్యంగా బంజారాలకు రిజర్వేషన్లు లభించినప్పటికీ పలు మారుమూల గ్రామాల్లో నివసిస్తున్న గిరిజన బంజారా కుటుంబాలు సమగ్ర అభివృద్ధికి ఇంకా దూరంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలోని ప్రతి వర్గాన్ని ఒకే తాటిపైకి తీసుకువచ్చి ఐక్యతతో ముందుకు నడిపించడమే బంజారా భారత్ ప్రధాన లక్ష్యమన్నారు.రవీంద్ర నాయక్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా బలోపేతమైన కమిటీని ఏర్పాటు చేసి యువతకు నాయకత్వ అవకాశాలు కల్పిస్తామని, సమాజ సేవా దృక్పథంతో పనిచేయగల యువ నాయకులు, కార్యకర్తలు ముందు రావాలని పిలుపునిచ్చారు.సభలో జాతీయ ఉపాధ్యక్షులు ఎ. నాగమణి నాయక్ మాట్లాడుతూ మహిళల సాధికారత, విద్య మరియు ఉపాధి రంగాల్లో బంజారా మహిళలు మరింత ముందుకు రావాల్సిన అవసరం ఉందని, సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకం అని తెలిపారు.తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జగన్ నాయక్ విశ్లావత్ సమావేశంలో రాష్ట్ర కమిటీని అధికారికంగా త్వరలో ప్రకటించాలని స్పష్టం చేశారు. గ్రామానికి నుండి రాష్ట్ర స్థాయికి వరకు సమాజ ఐక్యత, సంక్షేమం, హక్కుల సాధన కోసం ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయనుందని ఆయన దృఢ నిర్ధేశాన్ని వ్యక్తం చేశారు.సమావేశంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కే. హనుమంతు నాయక్, రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ సీతారాం నాయక్, రాష్ట్ర కన్వీనర్ రామావత్ బోనా నాయక్, బంజారా భారత్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జర్నలిస్ట్ సింగ్, జనరల్ సెక్రటరీ జవహర్ లాల్ నాయక్, ప్రొఫెసర్ శంకర్ నాయక్, బాలు నాయక్, రామచంద్ర నాయక్, తమిళనాడు నుంచి రవి నాయక్, శతపతి మోతిలాల్ నాయక్, మిథాలీ శంకర్ నాయక్, సభావత్ యాదగిరి నాయక్, చాంది, సుశీల, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.