📢 Advertisement Space

ఆమంగల్‌లో ఘన సన్మాన కార్యక్రమం

🗞️ బిబి న్యూస్ | 21 May 2026

ఆమంగల్, కల్వకుర్తి తాలూకా, రంగారెడ్డి జిల్లా పరిధిలో తెలంగాణ పంచాయితీ ట్రిబ్యునల్ చైర్మన్‌గా నియమితులైన సుధీని రామారెడ్డికి ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బంజారా భారత్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ జగన్ నాయక్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీలో గత కొన్ని సంవత్సరాలుగా శ్రీ సుధీని రామారెడ్డి చేస్తున్న సేవలను గుర్తించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు చైర్మన్ పదవి ఇవ్వడం ఎంతో ఆనందదాయకమని పేర్కొన్నారు.అనంతరం సుధీని రామారెడ్డిని సాలువాతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్. భోనా నాయక్, మాడుగుల జంగయ్యతో పాటు వివిధ తాలూకాల బంజారా నాయకులు పాల్గొని తమ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో జరిగింది.