ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల జోరు.. డీఈఓ డా. ప్రేమ్‌కుమార్ పర్యటన
🗞️ బిబి న్యూస్ | 14 May 2026
గోపాలపట్నం, మే 14: జీవీఎంసీ వార్డు-91 పరిధిలో జరుగుతున్న ప్రభుత్వ పాఠశాలల ప్రవేశాల కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ) డాక్టర్ ఎన్. ప్రేమ్‌కుమార్ స్టేట్ ఐటీ టీం సభ్యులతో కలిసి గురువారం సందర్శించారు.బుచ్చిరాజుపాలెం-18, గోపాలపట్నం E-బ్లాక్ & F-బ్లాక్ ప్రభుత్వ పాఠశాలలను పరిశీలించిన డీఈఓ స్వయంగా 6 నుంచి 8 మంది విద్యార్థులకు ప్రవేశం కల్పించారు. తల్లిదండ్రులకు పిలుపు ఇచ్చిన ఆయన, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, మధ్యాహ్న భోజనం, డిజిటల్ బోధన సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. "ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలను సమీప ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలి" అని కోరారు.బుచ్చిరాజుపాలెం పాఠశాలల్లో 2025-26 విద్యా సంవత్సరానికి 335 మంది రోలు లక్ష్యంగా 12 మంది అదనంగా చేరారని, ఈ కృషికి ప్రధానోపాధ్యాయులను డీఈఓ అభినందించారు. ప్రతి పాఠశాలలో గతేట లెక్క కంటే ఈసారి 15 శాతం అదనపు ప్రవేశాలు నమోదు చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు.
అనంతరం, విద్యార్థుల తల్లిదండ్రులు నింపిన దరఖాస్తులను డీఈఓ చేతుల మీదుగా ప్రధానోపాధ్యాయులకు అందజేశారు.కార్యక్రమంలో స్టేట్ ఐటీ టీం సభ్యుడు శేషుబాబు, డిప్యూటీ డీఈఓ సోమేశ్వరరావు, మండల విద్యాశాఖ అధికారి డి. దివాకర్, క్లస్టర్ హెడ్‌మాస్టర్లు వేణుగోపాల్, హేమలత, పాఠశాల ప్రధానోపాధ్యాయులు తోటకూర శ్రీధర్, స్వర్ణలత, సిఆర్‌పీలు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.